Andhra News: జలకళ పథకమే తప్పు: వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి

జలకళ పథకం కింద ఎంత మందికి బోరు వేయాలి? ఎంత లోతు వేయాలని మాకు కూడా అర్థం కాలేదు.

Updated : 22 May 2022 12:14 IST

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ‘జలకళ పథకం కింద ఎంత మందికి బోరు వేయాలి? ఎంత లోతు వేయాలని మాకు కూడా అర్థం కాలేదు. ఈ పథకమే తప్పు. ఒకరికి వేసి ఒకరికి వేయకుండా వస్తుంటారు’ అని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామపంచాయతీలో ‘గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జలకళ బోరు వేశారని, కరెంట్‌ ఇవ్వలేదని బాధితురాలు మల్లేశ్వరమ్మ ఎమ్మెల్యేకు విన్నవించారు. రేషన్‌ కార్డు కూడా తొలగించారని ఆమె వివరించగా.. పదెకరాల భూమి ఉండటంతో రేషన్‌కార్డు తొలగించారని వీఆర్వో లక్ష్మీనరసమ్మ సమాధానమిచ్చారు. పదెకరాల భూమి ఉంటే ‘జలకళ’ ఎలా వర్తిస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆ భూమిని పంచుకున్నారని వీఆర్వో సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని