అక్రమ మైనింగ్‌పై నిలదీత

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై మంగళవారం రెండోరోజూ ఎన్టీఆర్‌ జిల్లా రాఘవాపురం కొండవద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ఆందోళన కొనసాగించారు.

Published : 25 May 2022 05:24 IST

గ్రావెల్‌ తవ్వకాలపై రెండోరోజూ తెదేపా ఆందోళన
  తవ్వకాలవద్దే నిద్రించిన మాజీ ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై మంగళవారం రెండోరోజూ ఎన్టీఆర్‌ జిల్లా రాఘవాపురం కొండవద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ఆందోళన కొనసాగించారు. తవ్వకాల వద్దే సోమవారం రాత్రి వారు నిద్రించారు. జేసీబీలను, టిప్పర్లను అడ్డుకున్నారు. తెల్లవారుజామున నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళనకారులను నందిగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే సౌమ్య, నాయకులు స్వర్ణలత, ప్రవీణ, బుజ్జి, రాము, వీరాస్వామి తదితరులు 17మందిపై కేసులు నమోదు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అనుమతులు లేకుండా చేపట్టిన గ్రావెల్‌ తవ్వకాలను తెదేపా నేతలు మైనింగ్‌ విజిలెన్స్‌ విభాగం జియాలజిస్ట్‌ పురుషోత్తమనాయుడికి చూపారు. అధికారులకు నివేదిక పంపుతానని ఆయన తెలిపారు. జగనన్న కాలనీలకు కొండ గ్రావెల్‌ తరలింపునకు 0.80 సెంట్ల స్థలంలో తవ్వకానికి అనుమతులు కోరుతూ నందిగామ గనులశాఖ ఏడీకి విన్నపం పంపారని, అనుమతులు రాకుండానే వందలాది టిప్పర్ల గ్రావెల్‌ తరలిస్తున్నారని నేతలు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని