వైకాపాను దళిత, మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారు: హర్షకుమార్‌

‘వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎస్సీల పథకాలన్నీ తీసేశారు.. దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు... దళిత యువకుడ్ని ఒక ఎమ్మెల్సీ హత్య చేశారు..

Published : 27 May 2022 05:25 IST

రాజమహేంద్రవరం (క్వారీసెంటర్‌), న్యూస్‌టుడే: ‘వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎస్సీల పథకాలన్నీ తీసేశారు.. దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు... దళిత యువకుడ్ని ఒక ఎమ్మెల్సీ హత్య చేశారు.. ఇలా అన్నీ దారుణాలే’ అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ గురువారం సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. వైకాపాను దళితులు, మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారన్నారు. అందుకే రాజమహేంద్రవరంలో జూన్‌ 12న సన్నాహక సభ నిర్వహిస్తున్నానని, ఆ సభతో ప్రభుత్వం సంగతేంటో చూస్తానని పేర్కొన్నారు. కోనసీమలో ఒక మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను నిరసనకారులు తగులబెట్టారంటే పోలీసులు చూస్తూ ఉన్నారా? అని ప్రశ్నించారు. గొడవలు జరుగుతాయని తెలిసినా చర్యలేవీ తీసుకోలేదంటే నిఘా వ్యవస్థ విఫలమైందా? అని ప్రశ్నించారు. జిల్లాల పేర్లు ప్రకటించినప్పుడే అంబేడ్కర్‌ జిల్లాగా ప్రకటిస్తే ఏ సమస్యా లేకపోయేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఎస్సీలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారని, ఎక్కడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని