Raghurama: పార్లమెంటుకు లోబడే రాజధాని మార్పు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని రాజధానులుగా మార్చే అధికారం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పార్లమెంటుకే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. రాజధాని మార్పు, రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై కేంద్రమంత్రికి ఆయన లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాలతో పాటు ఇతర వసతుల కల్పనకు కేంద్రమే ఆర్థికసాయం చేయాల్సి ఉంటుందన్నారు. అమరావతిలో రాజధానికి

Updated : 19 Jul 2021 08:16 IST

 అమిత్‌ షాకు ఎంపీ రఘురామ లేఖ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని రాజధానులుగా మార్చే అధికారం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పార్లమెంటుకే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. రాజధాని మార్పు, రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై కేంద్రమంత్రికి ఆయన లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాలతో పాటు ఇతర వసతుల కల్పనకు కేంద్రమే ఆర్థికసాయం చేయాల్సి ఉంటుందన్నారు. అమరావతిలో రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, వసతుల కల్పనకు కేంద్రం సాయం చేసిందని, మొత్తంగా అమరావతిలో రూ.50 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని, భవిష్యత్తులో అది మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న మెజారిటీతో కేంద్ర చట్టాన్ని మార్చగలనని అనుకుంటోందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రతి రాష్ట్రం కేంద్ర చట్టాలను ఉల్లంఘించి తమ సొంత చట్టాలు చేసుకుంటాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఆయన తెలిపారు. రాజధానుల మార్పుపై హైకోర్టు యథాతథస్థితి ఆదేశాలు జారీచేసిందని, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని, అయినా మూడు రాజధానులపై రాష్ట్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. సమాఖ్య సూత్రాలకు లోబడి కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, పునర్విభజన చట్టానికి సవరణలు చేసేవరకు ఎలాంటి కదలిక లేకుండా చూడాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని