వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్షాల ఉమ్మడి పోటీ: మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌

వైకాపాను ఓడించేందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళులో

Published : 30 Dec 2021 08:02 IST

తూర్పుతాళ్ళు (నరసాపురం గ్రామీణ), న్యూస్‌టుడే: వైకాపాను ఓడించేందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళులో బుధవారం నిర్వహించిన ‘తెదేపా గౌరవ సభ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బిహార్‌ తరహా పరిస్థితులను వైకాపా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. భద్రతతో కూడిన, ప్రశాంతమైన పాలనకు తెదేపాను ప్రజలు ఆదరించాలి. వైకాపా ప్రభుత్వం అరాచకంగా, అసమర్థంగా పాలన సాగిస్తోంది’ అని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక సమస్యలపై కార్యకర్తలు స్పందించి వాటి పరిష్కారానికి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు