Updated : 18 Apr 2022 05:20 IST

Airport: కర్నూలు విమానాశ్రయానికి ప్రధానమంత్రి ఎక్సలెన్సు అవార్డు!

ఓర్వకల్లు న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ప్రారంభం నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు కేంద్ర విమానయాన పథకం(ఉడాన్‌) అరుదైన గౌరవం ప్రకటించినట్లు సమాచారం. ఇన్నోవేషన్‌ సెంట్రల్‌ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్‌-2020 కింద ప్రధానమంత్రి ఎక్సలెన్సు అవార్డు కర్నూలు విమానాశ్రయాన్ని వరించింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఈ అవార్డును ఈనెల 21న అందజేయనుంది. దీనిపై విమానాశ్రయ అధికారులను సంప్రదించగా, ఈ సమాచారం నిజమేనని, ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు.  

Read latest State News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని