తండ్రికి కరోనా.. ప్రేమ ఆగునా!
కరోనా.. కళ్లముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఓ అమ్మాయి కొవిడ్ సోకి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా..
న్యూస్‌టుడే, జి.సిగడాం: కరోనా.. కళ్లముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఓ అమ్మాయి కొవిడ్ సోకి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా.. తానే వెళ్లి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ వెంటనే ఆయన మృతిచెందారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో ఆదివారం జరిగింది. జగన్నాథవలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరినాయుడు(44) విజయవాడలో కూలి పనులు చేసుకునేవారు. ఇటీవల అక్కడ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. కుటుంబసభ్యులతో ఆదివారం స్వగ్రామానికి వచ్చేశారు. స్థానికులు వాళ్లను ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉండాలని సూచించారు. ఇంతలో అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కిందపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెళ్లేందుకు ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. కరోనా భయంతో తల్లి ఎంత వద్దంటున్నా.. కన్నతండ్రి మీద ప్రేమను చంపుకోలేక కుమార్తె వెళ్లి ఆయన గొంతులో నీరు పోసింది. ఆ వెంటనే ఆయన తుదిశ్వాస విడిచాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఉడుకుతున్న రాష్ట్రం
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!