AP News: చనిపోయిన ఏనుగు కోసం.. గజరాజుల తిష్ఠ

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామ సమీపంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఏనుగును ఖననం చేసిన ప్రదేశంలో 13 ఏనుగులు శుక్రవారం రాత్రి 9 నుంచి

Updated : 13 Jun 2021 07:37 IST

పలమనేరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామ సమీపంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఏనుగును ఖననం చేసిన ప్రదేశంలో 13 ఏనుగులు శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు ఉండిపోయాయి. ఏనుగును ఖననం చేసిన ప్రదేశాన్ని చుట్టి శబ్దాలు చేశాయి. వాటిని చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. తమ గుంపులోని ఏనుగు మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేని అవి గ్రామస్థులపైకి తిరగబడ్డాయి. వాటిని అడవిలోకి తరిమేందుకు స్థానికులు ప్రయత్నించగా చాలాసేపు ప్రతిఘటించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది, గ్రామస్థులు కలిసి వాటిని కౌండిన్య నదిని దాటించారు. కోతిగుట్ట గ్రామ సమీపంలోని పొలంలో గురువారం అర్ధరాత్రి ఐదేళ్ల ఆడ ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందగా శుక్రవారం అటవీశాఖ సిబ్బంది దానిని అక్కడే ఖననం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని