దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి

కొత్త జాతీయ విద్యావిధానం విద్యార్థి దిశ, దశను మారుస్తుందని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఛైర్మన్‌ డాక్టర్‌ డీపీ సింగ్‌ అన్నారు. కొత్త విద్యా విధానంలో పాఠశాల విద్య మొదలుకుని కళాశాల వరకు అనేక సంస్కరణలు, మార్పులకు ..

Published : 28 Aug 2021 04:14 IST

విద్యార్థులకు యూజీసీ ఛైర్మన్‌ డాక్టర్‌ డీపీ సింగ్‌ పిలుపు

 ఘనంగా విజ్ఞాన్‌ వర్సిటీ స్నాతకోత్సవం

ఈనాడు, అమరావతి: కొత్త జాతీయ విద్యావిధానం విద్యార్థి దిశ, దశను మారుస్తుందని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఛైర్మన్‌ డాక్టర్‌ డీపీ సింగ్‌ అన్నారు. కొత్త విద్యా విధానంలో పాఠశాల విద్య మొదలుకుని కళాశాల వరకు అనేక సంస్కరణలు, మార్పులకు నాంది పలికామన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన డీపీ సింగ్‌ మాట్లాడుతూ.. 2030 నాటికి సుస్థిరమైన అభివృద్ధిని సాధించి దేశాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతి ఇంజినీరింగ్‌ విద్యార్థి తమ వంతు పాత్రను పోషించాలన్నారు. విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత, వర్సిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ.. 100 ఏళ్లలో జరగని పురోగతి సాంకేతిక పరిజ్ఞానంతో గడిచిన 20-30 ఏళ్లలోనే సాధ్యపడిందని గుర్తుచేశారు. విశిష్ట అతిథి దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌స్వీవ్‌ కాన్‌ మాట్లాడుతూ.. భారత్‌-కొరియాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో కియా మోటార్ల కంపెనీ స్థాపించిన విషయాన్ని గుర్తుచేశారు. కిటో డైటీషియన్‌ వీరమాచినేని రామకృష్ణ, స్టూడెంట్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ లద్దాఖ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ సోనం వాంగ్‌చుక్‌లకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. వర్సిటీ కులపతి ఆచార్య కె.రామ్మూర్తినాయుడు, వైస్‌ఛైర్మన్‌, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఎం.వై.ఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 1866 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరో 48 మందికి బంగారు పతకాలు అందజేశారు.

Read latest State News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts