Published : 24/10/2021 07:43 IST

AP News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత

బయోమెట్రిక్‌ హాజరు లేదని 10-50% వరకు తగ్గింపు

ఈనాడు, అమరావతి: రెండేళ్ల సర్వీసు పూర్తవడంతో ప్రొబేషన్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. బయోమెట్రిక్‌ హాజరు లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10%, మరికొందరికి 50% వరకు తగ్గించారు. ఈ మేరకు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన డాటా జిల్లాలకు చేరింది. వీటి ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలని డ్రాయింగ్‌, డిజ్బర్స్‌మెంట్‌ అధికారుల(డీడీవో)ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ (ఆర్‌సీ నంబరు: 1/ఏ/2021) ఆదేశించింది. అయితే... క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా హాజరు లేదని జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు శనివారం మండల అధికారులకు వినతులు ఇచ్చారు. సాంకేతిక సమస్యలను సరిచేసి మరోసారి హాజరు, జీతాల డాటాను రూపొందించాలని కోరారు.
* సిగ్నల్‌ సమస్యతో కొన్ని చోట్ల బయోమెట్రిక్‌ ఆన్‌లైన్‌ విధానం సరిగా పనిచేయక పోవడం, కొన్నిచోట్ల డివైజ్‌లు అందుబాటులో లేక దస్త్రాల్లోనే సంతకాలు చేయాల్సిరావడం తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి.


పూర్వ పద్ధతిలోనే జీతాలివ్వాలి
- వెంకట్రామిరెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు

బయోమెట్రిక్‌ హాజరు యాప్‌తో సంబంధం లేకుండా పూర్వ పద్ధతిలోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. ప్రొబేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి రెగ్యులర్‌ స్కేల్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని