శ్రీశైలంలో భక్తుల వైపు దూసుకొచ్చిన లారీ

కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో ఆదివారం ఉదయం ఓ లారీ క్యూలైన్‌, భక్తుల వైపు దూసుకురావడం కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న లడ్డూ తయారీ

Published : 29 Nov 2021 03:56 IST

తప్పిన ప్రమాదం

ఆలయ క్యూలైన్‌ వద్ద ఆగిన లారీ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో ఆదివారం ఉదయం ఓ లారీ క్యూలైన్‌, భక్తుల వైపు దూసుకురావడం కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న లడ్డూ తయారీ కేంద్రానికి నెయ్యి సరఫరా చేయడానికి విజయ డెయిరీకి చెందిన లారీని డ్రైవర్‌ ..హరిహరరాయ గోపురం వద్ద మాడవీధిలో నిలిపారు. నెయ్యి క్యాన్లను అప్పగించాక, లారీని తీస్తుండగా స్టార్ట్‌ కాలేదు. స్థానికులు దాన్ని వెనక నుంచి తోయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో లారీ బ్రేకులు పని చేయకపోవడంతో అదుపు తప్పి క్యూలైన్ల వైపు దూసుకెళ్లింది. ఆలయ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది గట్టిగా కేకలు వేసి భక్తులను అప్రమత్తం చేశారు. ఆ వెంటనే లారీ చక్రాల వద్ద రాళ్లు వేసి ముందుకు వెళ్లకుండా నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని