ఆంధ్ర విశ్వవిద్యాలయ రీజియన్‌ ఓసీ, బీసీ-డీ సీట్లన్నీ భర్తీ

ట్రిపుల్‌ ఐటీల్లో 2021-22 ఏడాది ప్రవేశానికి ఈనెల 24 నుంచి చేపట్టిన కౌన్సెలింగ్‌లో నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లోనూ ఆంధ్ర విశ్వవిద్యాలయ రీజియన్‌ పరిధికి చెందిన ఓసీ, బీసీ-డీ

Updated : 29 Nov 2021 06:42 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ట్రిపుల్‌ ఐటీల్లో 2021-22 ఏడాది ప్రవేశానికి ఈనెల 24 నుంచి చేపట్టిన కౌన్సెలింగ్‌లో నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లోనూ ఆంధ్ర విశ్వవిద్యాలయ రీజియన్‌ పరిధికి చెందిన ఓసీ, బీసీ-డీ సీట్లన్నీ భర్తీ అయినట్లు ఆర్జీయూకేటీ ఉపకులపతి ఎమ్‌.చంద్రారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో మాత్రమే (ఎస్వీ విశ్వవిద్యాలయ రీజియన్‌కు సంబంధించి) 5 ఓసీ సీట్లు మిగిలి ఉన్నాయన్నారు. శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో నాన్‌లోకల్‌ విభాగంలో కొన్ని బీసీ-సి, ఎస్సీ, ఎస్టీ సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. వివిధ క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు సంబంధించిన సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. బీసీ-డి విభాగంలో ఎస్వీ విశ్వవిద్యాలయ రీజియన్‌ విద్యార్థులకు కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌ డిసెంబర్‌ 2వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని