ఉపాధి బాట కాదు.. రంగురాళ్ల వేట!

వీరంతా గుంపులుగా ఉపాధి హామీ పనుల్లో గుంతలు తవ్వుతున్నారనుకుంటే పొరపాటే. రంగురాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ కూటికొండలు గ్రామ

Published : 29 Nov 2021 03:56 IST

వీరంతా గుంపులుగా ఉపాధి హామీ పనుల్లో గుంతలు తవ్వుతున్నారనుకుంటే పొరపాటే. రంగురాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ కూటికొండలు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. పెద్ద గుంతలు తవ్వి రంగురాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. వ్యాపారులు స్థానికంగానే తిష్ఠ వేసి తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో వ్యాపారం జరిగినట్లు సమాచారం. సెప్టెంబరు నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని కూటికొండలు గ్రామస్థులు తెలిపారు.

- న్యూస్‌టుడే, జి.మాడుగుల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని