Updated : 29/11/2021 06:41 IST

అంత్యక్రియలకూ అంతులేని కష్టాలు

పాడేరు, న్యూస్‌టుడే: రోడ్డు, రవాణా సదుపాయం లేకపోవడంతో మృతదేహాన్ని 6 కిలో మీటర్లు కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ స్వగ్రామానికి తరలించిన ఘటన ఇది. విశాఖ జిల్లా పాడేరు మండలం మారుమూల దేవాపురం పంచాయతీ కాంగుగెడ్డ గ్రామానికి చెందిన రత్నకుమారి(25) పక్షవాతంతో బాధపడటంతో కుటుంబీకులు డోలిలో మూడు రోజుల క్రితం మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతదేహాన్ని రోడ్డు సదుపాయం ఉన్న వరకు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రామస్థులు, కుటుంబీకులు మృతదేహాన్ని చాపలో చుట్టి కావడిగా కట్టి 6 కిలోమీటర్ల దూరం కాలినడకన స్వగ్రామానికి తరలించారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని