బర్డ్‌కు అధునాతన ఎక్స్‌రే యంత్రం

తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో అధునాతన రూఫ్‌ సస్పెండెడ్‌ అల్ట్రా మోడరన్‌ డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. రూ.1.30 కోట్ల విలువైన ఈ యూనిట్‌ను

Published : 29 Nov 2021 03:56 IST

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ సౌజన్యం

కొత్త యంత్రం వద్ద బర్డ్‌ డైరెక్టర్‌ ధర్మారెడ్డి, దాత వెంకటేష్‌ దంపతులు

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో అధునాతన రూఫ్‌ సస్పెండెడ్‌ అల్ట్రా మోడరన్‌ డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. రూ.1.30 కోట్ల విలువైన ఈ యూనిట్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ అధినేత పి.వెంకటేష్‌, సుజాత దంపతులు విరాళంగా అందజేశారు. దీనిని దాత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తితిదే అదనపు ఈవో, ఆస్పత్రి సంచాలకుడు ఏవీ ధర్మారెడ్డి దాత వెంకటేష్‌ను సన్మానించారు. కదలలేని రోగులు, ప్రమాద బాధితులకు ఈ యంత్రం ఉపయోగంగా ఉంటుంది. ఎక్స్‌రే కోసం యంత్రం ముందు అటూఇటూ తిరగాల్సిన అవసరం లేదని, ఇందులోని పరికరాలే కదులుతూ అత్యంత నాణ్యంగా పరీక్షిస్తాయని వైద్యులు తెలిపారు. ఈ తరహా యంత్రం రాయలసీమలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ లేదు. బర్డ్‌ ఆస్పత్రిలో ఇప్పటికే సువర్ణ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి రావడంతో.. రోగిని ఎక్స్‌రే తీసిన కొన్ని నిమిషాల్లోనే ఆ ఫొటో ఎక్స్‌రే కన్సల్టింగ్‌ వైద్యుల వాట్సప్‌నకు చేరుతుంది. త్వరగా వైద్యం అందించే అవకాశం ఏర్పడింది. ఆస్పత్రి ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి, ఆర్‌ఎంవో కిశోర్‌కుమార్‌, వైద్యులు రామ్మూర్తి, వేణుగోపాల్‌, దీపక్‌, ఏఈవో పార్థసారథి, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని