విద్యార్థులతో పోస్ట్‌ కార్డుల ప్రచారం

‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో పోస్ట్‌ కార్డుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తపాలాశాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన కేంద్రీయ, ..

Published : 02 Dec 2021 04:22 IST

ఈనాడు, అమరావతి: ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో పోస్ట్‌ కార్డుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తపాలాశాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన కేంద్రీయ, నవోదయ, అనుబంధ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలకు చెందిన 4 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. బుధవారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం 20 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ‘స్వాతంత్య్ర పోరాటంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించిన యోధులు, 2047 నాటికి నా భారతదేశం’ అనే అంశాల్లో ఒక దానిపై ఆంగ్లం, హిందీ, భారత రాజ్యాంగం గుర్తించిన ఇతర భాషల్లో పోస్ట్‌ కార్డుపై రాసి తపాలా శాఖకు అందజేయాలని సూచించారు. 50 పైసల ధరకు పాఠశాలలకు కావాల్సిన కార్డులు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పాఠశాల నుంచి గుర్తించిన పది ఉత్తమ కార్డులను సంబంధిత పాఠశాల అధికారులు తపాలాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని వివరించారు. దేశవ్యాప్తంగా 75 ఉత్తమ ఎంట్రీలను ఎంపిక చేసి విజేతలకు వచ్చే ఏడాది జనవరి 17న దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానితో ముఖాముఖీగా మాట్లాడించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు సమీపంలోని తపాలా కార్యాలయాల్లో సంప్రదించాలని విద్యార్థులు, పాఠశాలల నిర్వాహకులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని