దూరప్రాంత బస్సులకు 60 రోజుల ముందే రిజర్వేషన్‌

దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ఇకపై 60 రోజులకు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సదుపాయం 30 రోజుల ముందు వరకే ఉండేది. దీన్ని పెంచుతూ ఆర్టీసీ ఎండీ

Updated : 02 Dec 2021 04:29 IST

ఈనాడు, అమరావతి: దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ఇకపై 60 రోజులకు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సదుపాయం 30 రోజుల ముందు వరకే ఉండేది. దీన్ని పెంచుతూ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. వరుస పండగలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు అన్నింట్లోనూ ఈ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. కొవిడ్‌తో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల వారసుల్లో అర్హత కలిగిన 97 మందిని జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించాలంటూ ఈడీ (పరిపాలన) కోటేశ్వరరావు బుధవారం ఆదేశాలు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని