ఫార్మెటివ్‌ పరీక్షలకు ఫీజు

ఫార్మెటివ్‌-2 పరీక్షలకు రెసిడెన్షియల్‌, పురపాలక, ఆదర్శ, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలు పరీక్ష ఫీజులు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Published : 05 Dec 2021 05:16 IST

ఈనాడు, అమరావతి: ఫార్మెటివ్‌-2 పరీక్షలకు రెసిడెన్షియల్‌, పురపాలక, ఆదర్శ, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలు పరీక్ష ఫీజులు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షలను ఈ ఏడాది నుంచే అన్ని పాఠశాలలకు కామన్‌ పరీక్షలుగా చేశారు. జిల్లా పరీక్షల విభాగాల నుంచి ప్రశ్నపత్రాలను ముద్రించి, సరఫరా చేసేందుకు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్తు, ఎయిడెడ్‌ మినహా మిగతా వారు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 6-8 తరగతుల విద్యార్థులు రూ.110, 9, 10 తరగతులకు రూ.140 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలి. గ్రామీణ ప్రైవేటు పాఠశాలలు 1-5 తరగతులకు రూ.70, పురపాలక పరిధిలో ఉండేవి రూ.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని