జనవరి 23న రాష్ట్రస్థాయి ఎన్‌టీఎస్‌ పరీక్ష

ఇంటర్‌ నుంచి ఆపై చదువులకు 2021-22 విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలు అందించేందుకు తెలంగాణలో (రాష్ట్ర స్థాయి) జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష-1(ఎన్‌టీఎస్‌)ను....

Published : 05 Dec 2021 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ నుంచి ఆపై చదువులకు 2021-22 విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలు అందించేందుకు తెలంగాణలో (రాష్ట్ర స్థాయి) జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష-1(ఎన్‌టీఎస్‌)ను జనవరి 23వ తేదీన(ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ప్రకటించింది. ఆ రోజు ఏపీ సహా పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్ర స్థాయి పరీక్షలుంటాయని పేర్కొంది. అలాగే, జాతీయస్థాయి పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ-2)ను వచ్చే జూన్‌ 12న జరపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 2 వేల మందిని ఉపకారవేతనాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్‌లో రెండేళ్లపాటు నెలకు రూ.1250 చొప్పున, డిగ్రీ నుంచి పీజీ వరకు నెలకు రూ.2 వేల చొప్పున అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని