ప్రాణాల మీదకు తెచ్చిన సెల్‌ఫోన్‌లో ‘ఆట’!

సెల్‌ఫోన్‌లో అదేపనిగా ఆట ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ విద్యార్థి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సెల్‌ఫోన్‌లో రోజూ ఓ ఆట ఆడుతూ దానికి అలవాటు పడిపోయాడు. ఇలా

Updated : 05 Dec 2021 05:52 IST

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌లో అదేపనిగా ఆట ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ విద్యార్థి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సెల్‌ఫోన్‌లో రోజూ ఓ ఆట ఆడుతూ దానికి అలవాటు పడిపోయాడు. ఇలా దాదాపు 3 నెలలుగా ఆడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి వద్ద స్పృహతప్పి పడిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి కర్నూలుకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులను గుర్తు పట్టలేకపోతున్నాడు. కుమారుడి పరిస్థితిని చూసి ఆ దంపతులు బోరున విలపిస్తున్నారు. ఆటకు అలవాటు పడటంతో నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని