శ్రీ వరాహస్వామి ఆలయానికి భక్తుల అనుమతి

తిరుమలలోని శ్రీ వరాహస్వామి ఆలయంలోకి శనివారం నుంచి భక్తులను అనుమతించారు. ఆలయ విమాన గోపురానికి బంగారు పూత...

Published : 05 Dec 2021 05:23 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని శ్రీ వరాహస్వామి ఆలయంలోకి శనివారం నుంచి భక్తులను అనుమతించారు. ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు గతేడాది డిసెంబరు 6 నుంచి బాలాలయ సంప్రోక్షణ నిర్వహించారు. అప్పటి నుంచి ఆలయంలో భక్తులకు దర్శనాలు రద్దు చేశారు. గతనెల 29న ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులను అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని