లింకు రోడ్డులో తిరుమలకు వాహనాల అనుమతి

తితిదే లింకు రోడ్డు ద్వారా శనివారం ఉదయం నుంచి తిరుమలకు వాహనాలను అనుమతించింది. భారీ వర్షాలతో ఈనెల 2వ తేదీన రెండో ఘాట్‌ రోడ్డులో బండ రాళ్లు పడి దారి ధ్వంసమైన విషయం తెలిసిందే.

Published : 05 Dec 2021 05:28 IST

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులోని లింకు రోడ్డు

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే లింకు రోడ్డు ద్వారా శనివారం ఉదయం నుంచి తిరుమలకు వాహనాలను అనుమతించింది. భారీ వర్షాలతో ఈనెల 2వ తేదీన రెండో ఘాట్‌ రోడ్డులో బండ రాళ్లు పడి దారి ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో మొదటి ఘాట్‌ రోడ్డు నుంచే వాహనాలను అనుమతించారు. అలిపిరి వద్ద వాహనాల రాకపోకలకు 2 గంటలకు పైగా వేచి ఉండాల్సిన రావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సమస్యను పరిష్కరించేందుకు తితిదే రెండో ఘాట్‌ రోడ్డులో వాహనాలను అనుమతించి.. లింకు రోడ్డు ద్వారా మోకాళ్ల మెట్టు నుంచి తిరుమలకు చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో వాహనాలను అర్ధగంట పాటు ఆపి, పంపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని