Published : 05/12/2021 05:28 IST

స్వయంకృషితో ముందుకు సాగారు..

వంతెన పనుల్లో మహిళలు

తిరుపతి గ్రామీణ, న్యూస్‌టుడే: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తిరుపతి గ్రామీణ మండలం కూపుచంద్రపేట గ్రామస్థులు తాత్కాలిక రహదారి పనులు చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వరద ఉద్ధృతికి రెండు వారాల ముందు వంతెన కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్థులు జీవనోపాధి కోసం తిరుపతికి వెళ్లలేక పోతున్నారు. తాత్కాలిక రోడ్డు పనులు చేసేందుకు సుమారు వంద మంది యువకులు, పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు ముందుకు వచ్చారు. భాగ్యనగరానికి చెందిన రాఘవరెడ్డి, దుర్గసముద్రానికి చెందిన శేఖర్‌లు జేసీబీ, ట్రాక్టర్లను సమకూర్చారు. కూపుచంద్రపేట సర్పంచి పిపాసి కొందరు కూలీలను ఏర్పాటుచేసి, వారికి భోజన వసతి కల్పించడంతో అందరూ చేయీచేయి కలిపారు. మహిళా సంఘం సభ్యులు 500 ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. వీటిని వరద నీటికి అడ్డంగా వేసి నీటిని మళ్లించారు. గ్రావెల్‌ని కుంగిపోయిన వంతెనపై పోసి చదును చేసి రాకపోకలకు వీలు కల్పించారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని