
Published : 08 Dec 2021 04:18 IST
నేడు 11 మంది ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 8 జిల్లాల పరిధిలోని 11 స్థానికసంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన 11మంది వైకాపా ఎమ్మెల్సీలు బుధవారం పదవీప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలోని శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఛైర్మన్ మోసేను రాజు వారితో ప్రమాణం చేయించనున్నారు. ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, తలశిల రఘురాం, అనంత ఉదయ భాస్కర్, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ఇందుకూరి రఘురాజు, వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస్, కృష్ణరాఘవ జయేంద్ర భరత్, తూమాటి మాధవరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఈ 11మందితో పాటు ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా, డీసీ గోవిందరెడ్డిలను అసెంబ్లీ ఆవరణలోనే సన్మానించనున్నారు.
Tags :