ఏపీ పిటిషన్‌ను రద్దు చేయండి

డిండి ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం చేపట్టిన పనులు తాగు, పారిశ్రామిక అవసరాల కోసమేనని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) దృష్టికి తెచ్చింది.

Published : 08 Dec 2021 04:29 IST

డిండి ఎత్తిపోతలపై ఎన్‌జీటీలో తెలంగాణ కౌంటర్‌

ఈనాడు హైదరాబాద్‌: డిండి ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం చేపట్టిన పనులు తాగు, పారిశ్రామిక అవసరాల కోసమేనని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) దృష్టికి తెచ్చింది. కరవుపీడిత, ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడం ప్రధానమని పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన వీరాంజనేయ రిజర్వాయర్‌ వెనకభాగం నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 30 టీఎంసీల వరద నీటిని మళ్లించేలా ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపింది.  భవిష్యత్తులో సాగునీటి అవసరాలూ ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేయాలని కోరింది. పర్యావరణ అనుమతులు లేకుండా తెలంగాణ డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందంటూ ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీటీని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని