సరోగసీ ద్వారా తల్లయిన మహిళకు మాతృత్వపు సెలవులు: హైకోర్టు

సరోగసీ (అద్దె గర్భం) విధానంలో వేరే మహిళ ద్వారా ఇద్దరు కవలలకు తల్లి

Updated : 09 Jan 2022 09:58 IST

ఈనాడు, అమరావతి: సరోగసీ (అద్దె గర్భం) విధానంలో వేరే మహిళ ద్వారా ఇద్దరు కవలలకు తల్లి అయిన మహిళకు శిశువుల ఆలనాపాలన చూసుకునేందుకు మెటర్నిటీ లీవ్‌ (మాతృత్వపు సెలవు) మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. సెలవులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడాన్ని తప్పుబట్టింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య ఈ నెల 6న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కాకినాడకు చెందిన కిరణ్మయి అనే మహిళా వైద్యురాలు అద్దె గర్భంతో వేరే మహిళద్వారా కవల పిల్లలకు తల్లయ్యారు. అయితే బిడ్డలను ఆమె కనలేదన్న ఉద్దేశంతో మెటర్నిటీ లీవు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మంజూరు చేయబోయే సెలవులు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని