గుడివాడలో జూద క్రీడలు, నృత్యాలు

కృష్ణా జిల్లా గుడివాడలో యువతుల చిందులు, జూద క్రీడలతో ఈ ఏడాది కొత్త సంస్కృతికి తెరలేపారు. డివిజన్‌ పోలీస్‌ అధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పట్టణానికి సమీపంలోని లింగవరం రహదారిలో ఓ రాజకీయ

Published : 17 Jan 2022 04:19 IST

గుడివాడ, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడలో యువతుల చిందులు, జూద క్రీడలతో ఈ ఏడాది కొత్త సంస్కృతికి తెరలేపారు. డివిజన్‌ పోలీస్‌ అధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పట్టణానికి సమీపంలోని లింగవరం రహదారిలో ఓ రాజకీయ ప్రముఖుడికి చెందిన ఖరీదైన ఫంక్షన్‌హాల్‌ పక్కనే సంప్రదాయాల పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పక్కనే గుడివాడలో తొలిసారిగా క్యాసినో తరహాలో ఖరీదైన జూదశాలను ఏర్పాటు చేశారు. అక్కడే ప్రత్యేక వేదికపై హైదరాబాద్‌ యువతులతో నృత్యాలు చేయించారు. వారితోనే పలు జూదాలు నిర్వహించారు. ప్రవేశానికి రూ.10 వేల టికెట్‌తో తెలిసిన వారికే టోకెన్లు జారీ చేశారు. విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తరలివచ్చారు. మూడు రోజులపాటు యథేచ్ఛగా ఇదంతా సాగినా.. పోలీసుల దృష్టికి వెళ్లకపోవడం గమనార్హం. ఓ రాజకీయ ప్రముఖుని అండదండలతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు దీన్ని నిర్వహించారని తెలిసింది.

రూ.లక్షల్లో కోడి పందేలు

ఇదే ఫంక్షన్‌ హాల్‌ పక్కనే మూడు రోజులపాటు నిర్వహించిన కోడి పందేలకు పెద్దఎత్తున జనం వచ్చారు. ఖరీదైన కార్లలో, హైదరాబాద్‌, విజయవాడ వంటి దూరప్రాంతాల నుంచి సైతం వచ్చి జోరుగా పందేలు కాశారు. వాటిలో రూ.లక్షకు పైబడినవే అధికంగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని