110 వసంతాల బామ్మ

నూటపదేళ్ల బామ్మ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు ఆమె వారసులు. గుంటూరు జిల్లా రాజోలు పంచాయతీ పరిధి పడమటపాలేనికి చెందిన జన్ను వెంకటసుబ్బమ్మకు ఆదివారంతో 110 ఏళ్లు నిండాయి.

Updated : 17 Jan 2022 05:19 IST

ఘనంగా పుట్టిన రోజు చేసిన వారసులు

రాజోలు(చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: నూటపదేళ్ల బామ్మ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు ఆమె వారసులు. గుంటూరు జిల్లా రాజోలు పంచాయతీ పరిధి పడమటపాలేనికి చెందిన జన్ను వెంకటసుబ్బమ్మకు ఆదివారంతో 110 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆమె కేకు కోసి వారసులకు ఆశీస్సులు అందించారు. వెంకటసుబ్బమ్మ 1911 జనవరి 16న జన్మించారు. మాజీ మంత్రి దివంగత అనగాని భగవంతరావు అన్నయ్య కుమార్తె అయిన ఆమెకు పదిహేనేళ్ల వయసులో జన్ను రామయ్యతో పెళ్లయింది. వీరికి ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వారి సంతానం మొత్తం 110 మంది ఉన్నారు. రామయ్య 1989లో మృతి చెందారు. వెంకటసుబ్బమ్మ ఐదో తరగతి వరకు చదువుకున్నారు. హార్మోనియం, సంగీతం, పాటలు పాడటం నేర్చుకున్నారు. రోజులో 18 గంటలపాటు పొలం, ఇంటి పనిచేసేవారు. నలభై ఏళ్ల క్రితం వైద్యుడి సూచన మేరకు ఆమె ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని