పంచాయతీ కార్యదర్శులకు సీనియర్‌ అసిస్టెంట్‌ పే స్కేల్‌ వర్తింపజేయాలి

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నుంచి నియమితులైన పంచాయతీ కార్యదర్శులకు సీనియర్‌ అసిస్టెంట్‌ పే స్కేల్‌ వర్తించేలా పీఆర్సీలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

Published : 19 Jan 2022 04:47 IST

ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య డిమాండ్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నుంచి నియమితులైన పంచాయతీ కార్యదర్శులకు సీనియర్‌ అసిస్టెంట్‌ పే స్కేల్‌ వర్తించేలా పీఆర్సీలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సచివాలయాల్లో నియమితులైన గ్రేడ్‌-5, 6 పంచాయతీ కార్యదర్శులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్‌, ప్రధాన కార్యదర్శి బందేల రమేశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ సంఘాలు 23% ఫిట్‌మెంట్‌కు అంగీకరిస్తే...కనీసం చర్చించకుండా హెచ్‌ఆర్‌ఏలో కోతలు విధించి జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వృద్ధాప్యంతో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ..పీఆర్‌సీలో క్వాంటమ్‌ పెన్షన్‌ పెరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్న సీనియర్లకు ప్రభుత్వ నిర్ణయం శరాఘతమని వారు పేర్కొన్నారు. సీఎం ఇప్పటికైనా పునః సమీక్షించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఎలాంటి ఆందోళనలకైనా సిద్ధమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని