విభాగాలన్నింటికీ ఒకే పోర్టల్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిర్వాహకులతో ఫిబ్రవరి 4న రాజమహేంద్రవరంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొనే ప్రధాన

Published : 19 Jan 2022 04:47 IST

పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిర్వాహకులతో ఫిబ్రవరి 4న రాజమహేంద్రవరంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలపై చర్చిస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలో పరిశ్రమల శాఖపై మంగళవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘విమానాశ్రయాలు, ఓడ రేవుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ ఏడాదిలో (2022-23) నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా ఒక ప్రణాళికను రూపొందించాలి. విశాఖ-చెన్నై కారిడార్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. వీటన్నింటిపై ఫిబ్రవరి 4న నిర్వహించే సమావేశానికి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలి’’ అని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖలోని విభాగాలన్నింటినీ ఒకే పోర్టల్‌ కిందకు తీసుకురావాలని సూచించారు. ‘‘ప్రస్తుతం వేర్వేరు పోర్టల్‌లను నిర్వహిస్తున్నాయి. దీన్ని ఒకే వెబ్‌సైట్‌గా మార్చాలి. దీనివల్ల ఏపీఐఐసీ, ఈడీబీ, ఎంఎస్‌ఎంఈ, మారిటైం బోర్డులకు సంబంధించిన అన్ని విభాగాలను పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది’’ అని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. లాజిస్టిక్‌ పాలసీ, విద్యుత్‌ వాహనాల పాలసీ గురించి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వళవన్‌ను అడిగి తెలుసుకున్నారు.

హస్తకళాకారులకు శిక్షణ ఇవ్వాలి: హస్తకళలు, బొమ్మల తయారీలో మరింత నైపుణ్యం పెంచేందుకు కళాకారులకు శిక్షణనివ్వాలని అధికారులను చేనేత, జౌళిశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో చేనేత, జౌళిశాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని