తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ప్రణయ కలహోత్సవం వైభవంగా జరిగింది. ఏటా వైకుంఠ ఏకాదశికి ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు మలయప్పస్వామివారు పల్లకిపై పుష్కరిణి వద్దకు వచ్చారు.

Updated : 19 Jan 2022 05:37 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ప్రణయ కలహోత్సవం వైభవంగా జరిగింది. ఏటా వైకుంఠ ఏకాదశికి ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు మలయప్పస్వామివారు పల్లకిపై పుష్కరిణి వద్దకు వచ్చారు. అమ్మవార్లు చెరొక పల్లకిపై స్వామివారికి ఎదురుగా వచ్చారు. పురాణపఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జీయంగారు పూలచెండ్లతో వేటకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడ్డారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని పాశురాలను నింద-స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని