రాజధానిపై ఎందుకీ సందిగ్ధత?

రాష్ట్రం విడిపోయి దాదాపు ఏడున్నరేళ్లు అవుతున్నా.. ఇంకా రాజధాని ఏదో ఎవరికీ చెప్పలేని స్థితిలోకి వైకాపా ప్రభుత్వం నెట్టిందని అమరావతి రైతులు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ఆడుతున్న రాజకీయ క్రీడకు

Published : 20 Jan 2022 05:22 IST

అమరావతి రైతుల ప్రశ్న

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రం విడిపోయి దాదాపు ఏడున్నరేళ్లు అవుతున్నా.. ఇంకా రాజధాని ఏదో ఎవరికీ చెప్పలేని స్థితిలోకి వైకాపా ప్రభుత్వం నెట్టిందని అమరావతి రైతులు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ఆడుతున్న రాజకీయ క్రీడకు ఇకనైనా ముగింపు పలికి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. నిర్మాణంలో ఉన్న రాజధానిని వదిలేసి, మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించడం ఆయన స్థాయికి తగదన్నారు. మూడు రాజధానుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు బుధవారం 764వ రోజుకు చేరాయి. అమరావతి కొనసాగాలని తుళ్లూరులో మహిళలు న్యాయదేవతకు పూజలు చేసి, గీతాపారాయణం చేశారు. కృష్ణాయపాలెం, మందడం, దొండపాడు, వెలగపూడి, మోతడక, పెదపరిమి తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు, రాజంపేట పార్లమెంటు రైతు నాయకుడు వెంకటేష్‌, తదితరులు వెలగపూడి దీక్షా శిబిరాన్ని సందర్శించి.. మద్దతు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని