ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర

ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే

Published : 20 Jan 2022 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటిన్నర మందికి పైగా భక్తులొస్తారని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ ఉత్సవాలకు రూ. 75 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. భక్తులకు అరగంటలోనే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని