సీఐ అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

వినుకొండ గ్రామీణ సీఐ బొడ్డు అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ గుంటూరు డీఐజీ త్రివిక్రమవర్మ ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఆయన మంగళవారం ప్రకాశం ఎస్పీ కార్యాలయంలో

Published : 20 Jan 2022 05:28 IST

వినుకొండ, న్యూస్‌టుడే: వినుకొండ గ్రామీణ సీఐ బొడ్డు అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ గుంటూరు డీఐజీ త్రివిక్రమవర్మ ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఆయన మంగళవారం ప్రకాశం ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి వీఆర్‌లో ఉన్నారు. శావల్యాపురం మండలం వేల్పూరులో ఈనెల 6న జరిగిన ఘటనలో రైతు గడిపూడి నరేంద్రపై నమోదైన హత్యాయత్నం కేసు వ్యవహారంలో సీఐను సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఇప్పుడు దానిని ఎత్తివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని