రాష్ట్రానికి 350 ఎలక్ట్రికల్‌ బస్సులు

కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రాయితీతో రాష్ట్రానికి 350 ఎలక్ట్రికల్‌ బస్సులు మంజూరయ్యాయని ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. అందులో వంద బస్సులను తిరుమల, తిరుపతికి కేటాయించామని

Published : 20 Jan 2022 05:30 IST

ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి

కడప (చిన్నచౌకు), న్యూస్‌టుడే: కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రాయితీతో రాష్ట్రానికి 350 ఎలక్ట్రికల్‌ బస్సులు మంజూరయ్యాయని ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. అందులో వంద బస్సులను తిరుమల, తిరుపతికి కేటాయించామని చెప్పారు. బుధవారం కడపలోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ ఈడీ రవివర్మ, ఆర్‌ఎం జితేంద్రనాథ్‌రెడ్డి, ఓఎస్డీ గోపితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం బస్సుల్లో విశాఖపట్నానికి 100, విజయవాడ 50, గుంటూరు 50, కాకినాడ 50, తిరుమల 50, తిరుపతికి 50 చొప్పున కేటాయించామని వివరించారు. తిరుపతి నుంచి విమానాశ్రయానికి 14, కడపకు 12, మదనపల్లెకు 12, నెల్లూరుకు 12 ఎలక్ట్రికల్‌ బస్సులు నడపనున్నామని వెల్లడించారు. పూర్తి ఏసీ బస్సులో 2+2 సీట్లు ఉంటాయని, 35 మంది ప్రయాణించవచ్చన్నారు. కడప బస్టాండులో ఛార్జింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రాయితీ పోను ఒక్కో బస్సు కోటి రూపాయలు అవుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని