వంకపై విద్యార్థి విజయం!

వంకపై కాజ్‌వే లేక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందిపడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. పిల్లలే చందాలు వసూలు చేసి పెద్దల సాయంతో తాత్కాలిక వారధి నిర్మించుకున్నారు. కడప విద్యార్థుల సమష్టి కృషికి ఆ

Published : 20 Jan 2022 05:37 IST

చందాలతో కర్రల వంతెన ఏర్పాటు చేసుకున్న పిల్లలు

కడప(చిన్నచౌకు), న్యూస్‌టుడే: వంకపై కాజ్‌వే లేక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందిపడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. పిల్లలే చందాలు వసూలు చేసి పెద్దల సాయంతో తాత్కాలిక వారధి నిర్మించుకున్నారు. కడప విద్యార్థుల సమష్టి కృషికి ఆ వంతెనే నిదర్శనం. కడప నగరం నడిబొడ్డున ప్రవహిస్తున్న బుగ్గ వంకపై గుర్రాలగడ్డ వద్ద ఉన్న కాజ్‌వే 3 నెలల కిందటి వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి గుర్రాలగడ్డ, రవీంద్రనగర్‌, మురాదియానగర్‌, రాముని గుడి, సంక్షేమ కాలనీ, మరాఠీ వీధి ప్రాంతాల ప్రజలు చాలా దూరంగా ఉన్న పాతబస్టాండు, కాగితాలపెంట కాజ్‌వేలపై నుంచి వెళ్లేవారు. దీంతో సమయం వృథానే కాదు.. ఆటోలకు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. మురాదియానగర్‌, రవీంద్రనగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన పిల్లలు మోచంపేట సమీపంలోని బడికెళ్లడం మరీ ఇబ్బందిగా ఉండేది. వారిని నిత్యం తల్లిదండ్రులు తీసుకెళ్లాల్సి వచ్చేది. అదే.. గుర్రాలగడ్డ వద్ద వంతెన ఉంటే పిల్లలే వెళ్లేవారు. సమస్య మూడు నెలల నుంచి ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు ముందుకొచ్చి తల్లిదండ్రులు, తెలిసిన వారి వద్ద చందాలు సేకరించారు. చందాల మొత్తం రూ.10 వేలు, పెద్దల సాయంతో వంకపై కర్రలతో వారధి ఏర్పాటు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని