ఉద్యోగులతో చర్చించాకే పీఆర్సీ ఇచ్చారు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించాకే వేతన సవరణను ప్రకటించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు

Published : 20 Jan 2022 05:38 IST

మంత్రి బొత్స సత్యనారాయణ

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించాకే వేతన సవరణను ప్రకటించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కాకినాడ స్మార్ట్‌సిటీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల ఆమోదంతోనే పీఆర్సీ ఇచ్చారని, దీనిపై వారికి ఇప్పుడు భేదాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చనన్నారు. పునఃపరిశీలన చేయాలని కోరుతున్నారని, ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి టెండర్లు పిలిచారని, బ్యాంకు రుణాలు, రోడ్డు సెస్‌ నిధులతో మరమ్మతులు చేపట్టనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 18 నగరపాలక సంస్థల్లో నాలుగింటిని స్మార్ట్‌సిటీలుగా ఎంపిక చేశారని, మిగతా వాటిని కూడా దీని పరిధిలోకి తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్‌, కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు చంద్రశేఖరరెడ్డి, చిట్టిబాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని