ప్రత్యేక రైల్లో విశాఖ వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం విశాఖపట్నం చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయనకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, జేసీ వేణుగోపాలరెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, వాల్తేర్‌ డివిజనల్‌

Published : 20 Jan 2022 05:41 IST

విశాఖపట్నం(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం విశాఖపట్నం చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయనకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, జేసీ వేణుగోపాలరెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, వాల్తేర్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అనూప్‌ సతపతి, తూర్పు నావికాదళ రియర్‌ అడ్మిరల్‌ సర్దేశాయ్‌ తదితరులు ఆహ్వానం పలికారు. ఈ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి విశాఖకు 4.30 గంటల్లో వచ్చినట్లు వాల్తేర్‌ రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని