సచివాలయం ఉద్యోగుల ర్యాలీ

తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులను వెలువరించిందని మండిపడుతూ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు గురువారం ఆందోళన చేశారు. అంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సోమవారం నుంచి ఉద్యమాన్ని తీవ్రం చేయాలని నిర్ణయించారు.

Published : 21 Jan 2022 05:51 IST

ఈనాడు, అమరావతి: తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులను వెలువరించిందని మండిపడుతూ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు గురువారం ఆందోళన చేశారు. అంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సోమవారం నుంచి ఉద్యమాన్ని తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్‌.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ఉద్యోగులు సమావేశమై చర్చించారు. సచివాలయ ఉద్యోగులు ఆందోళన తెలపాల్సిన విధానం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం సచివాలయం గేటు నుంచి మొదటి బ్లాకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్‌.వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని