ఉద్యోగ సంఘాల నేతలతోమాట్లాడాకే పీఆర్సీ జీవోల విడుదల: మంత్రి బొత్స

పీఆర్సీపై ఏకపక్షంగా జీవోలు ఇవ్వలేదని, ఉద్యోగ సంఘాల నాయకులందరితో మాట్లాడిన అనంతరమే ప్రభుత్వం వాటిని విడుదల చేసిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం

Published : 21 Jan 2022 05:51 IST

ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ఏకపక్షంగా జీవోలు ఇవ్వలేదని, ఉద్యోగ సంఘాల నాయకులందరితో మాట్లాడిన అనంతరమే ప్రభుత్వం వాటిని విడుదల చేసిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఏపీ పురపాలక కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జీవోలలో పేర్కొన్న ఏమైనా అంశాలపై ఉద్యోగులకు ఇబ్బందులుంటే ప్రభుత్వ పరంగా వాటిపై తప్పకుండా ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవచ్చని... సమ్మెబాట పట్టడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌, ఇతరత్రా సమస్యల నేపథ్యంలో ఉద్యోగుల సమ్మె ఆలోచన సరికాదని, చర్చలతో పరిష్కారం కాని సమస్యంటూ ఏదీ లేదన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు పునరాలోచించుకోవాలని సూచించారు. ‘పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం... పురపాలక సంఘాల కార్మికుల వేతనాలను పెంచాం. ఆప్కాస్‌ నుంచి చెల్లిస్తున్నాం. నెలనెలా జీతాలు అందేలా చూస్తున్నాం. సాంకేతిక కారణాలతో కొందరికి జీతాలు అందడం లేదు. వాటినీ పరిష్కరిస్తాం’ మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని