పోలీసు నిర్బంధం మధ్య బోధన

చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ పత్రికా సంపాదకుడు పి.తులసీనాథం నాయుడును గురువారం నిద్రలేచిన దగ్గర నుంచి పోలీసులు వెంటాడారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయ

Published : 21 Jan 2022 05:51 IST

పలమనేరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ పత్రికా సంపాదకుడు పి.తులసీనాథం నాయుడును గురువారం నిద్రలేచిన దగ్గర నుంచి పోలీసులు వెంటాడారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఉదయమే పోలీసులు ఆయన వద్దకు వచ్చి కదలనీయలేదు. తాను పిల్లలకు పాఠాలు చెప్పాలని బతిమాలితే... తాము కూడా వెంట వస్తామని తెలిపారు. దాంతో కానిస్టేబుల్‌ను పక్కనే పెట్టుకుని ఉదయం నుంచి స్కూల్‌ వదిలే వరకు ఆయన పిల్లలకు పాఠాలు బోధించాల్సి వచ్చింది. ‘పోలీసు నిర్బంధంలో పాఠ్యాంశాలు బోధిస్తానని కలలో కూడా అనుకోలేదు’ అని ఆయన వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని