నేటి నుంచి రోజుకు వెయ్యి మంది కొవిడ్‌ బాధితులకు వైద్యం

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి జూమ్‌ ద్వారా రోజుకు వెయ్యి మందికి వైద్య సలహాలు, అవసరమైన సహాయం అందించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. గురువారం 360 మంది కొవిడ్‌ బాధితులకు వైద్య

Updated : 21 Jan 2022 06:03 IST

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి జూమ్‌ ద్వారా రోజుకు వెయ్యి మందికి వైద్య సలహాలు, అవసరమైన సహాయం అందించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. గురువారం 360 మంది కొవిడ్‌ బాధితులకు వైద్య సహాయం, మందులను అందించామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ‘తెలుగుదేశం వర్గాల ద్వారా జూమ్‌ లింక్‌ను ప్రజలకు అందే ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఉదయం 7.30 గంటలకు టెలిమెడిసిన్‌ ప్రక్రియ పారంభం అవుతుంది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవలకు తోడ్పాటు అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం వైద్య విభాగం అధ్యక్షుడు జడ్‌.శివప్రసాద్‌ 5వేల మందికి మందులు అందిస్తున్నారు. అదనంగా వైద్యులు, సిబ్బందిని నియమించుకుని ఎక్కువ మంది రోగులకు సహాయపడేలా ప్రణాళికలు సిద్ధం చేశాం...’ అని భువనేశ్వరి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని