కడపలో ‘బ్రిటిషర్ల’ సొరంగ కారాగారం

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గఅగ్రహారంలోని బుగ్గమల్లేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో  సొరంగ కారాగారం వెలుగుచూసింది.

Published : 23 Jan 2022 04:53 IST

కడప (యోగి వేమన విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గఅగ్రహారంలోని బుగ్గమల్లేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో  సొరంగ కారాగారం వెలుగుచూసింది. మైదుకూరుకు చెందిన నేస్తం సేవా సంస్థ ప్రతినిధి బాల నాగిరెడ్డి బుగ్గవంక ప్రాజెక్టును చూడటానికి వెళ్లగా... భూమి పైభాగంలో చిన్న రంధ్రాన్ని గుర్తించారు. అందులోకి దిగి పరిశీలించగా లోపల అద్భుతమైన నిర్మాణం బయటపడింది. దీనిపై చిత్తూరు, కడప పురావస్తుశాఖ ఏడీ శివకుమార్‌ మాట్లాడుతూ... ‘ఈ కారాగారం బ్రిటిష్‌ కాలం నాటిది. దీన్ని బంకరుగా, గోదాంగానూ ఉపయోగించి ఉండవచ్చు. ఇలాంటి నిర్మాణాలను బ్రిటిషర్లు రైల్వే ట్రాకు సమీపంలో నిర్మించేవారు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని