22 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22వ తేదీ నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. ఉత్సవాల సమయంలో

Published : 23 Jan 2022 04:57 IST

ఆ రోజుల్లో గదుల ముందస్తు రిజర్వేషన్‌ నిలుపుదల

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22వ తేదీ నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. కుటీర నిర్మాణ పథకం కింద వసతిగదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలోలాగా ముందస్తు రిజర్వేషన్‌ ఉంటుందన్నారు. దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10వ తేదీలోగా దేవస్థానం కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని