సీఎం జగన్‌పై ట్విటర్‌లో పోస్టులు.. ఆ వ్యక్తిపై రిమాండ్‌ నివేదిక తిరస్కరణ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై పోస్టింగ్‌లు పెట్టిన రాజుపాలెపు పవన్‌ ఫణిపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన రిమాండ్‌ నివేదికను గుంటూరులోని ఆరో అదనపు కోర్టు

Updated : 23 Jan 2022 08:39 IST

న్యూస్‌టుడే- గుంటూరు లీగల్‌: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై పోస్టింగ్‌లు పెట్టిన రాజుపాలెపు పవన్‌ ఫణిపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన రిమాండ్‌ నివేదికను గుంటూరులోని ఆరో అదనపు కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి సయ్యద్‌ జియావుద్దీన్‌ తిరస్కరించారు. నిందితుడిపై మోపిన 121, 124ఏ రాజద్రోహంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్లను బనాయించారని, అవి ఈ కేసుకు వర్తించవని న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మానవబాంబునై చంపేస్తానని రాజమహేంద్రవరానికి చెందిన పవన్‌ ఫణి ట్విటర్‌లో పోస్టు చేశాడని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా, ప్రజల మధ్య గొడవలు సృష్టించేలా, శాంతిభద్రతల సమస్యకు దారితీసేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఫణిని గుంటూరులోని సీఐడీ కోర్టులో శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి అతనిపై నమోదు చేసిన వివిధ నేరాలు సరిగా లేవని, మరికొన్ని 7ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయని పేర్కొంటూ నిందితుడికి నోటీసులిచ్చి సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఫణిని విడిచిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని