మెరుపు సమ్మెకు దిగుతాం

తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో మెరుపు సమ్మె చేయడానికి వెనకాడబోమని విద్యుత్తు ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు. శనివారం కడపలో

Published : 23 Jan 2022 04:57 IST

విద్యుత్తు ఉద్యోగుల హెచ్చరిక

ఈనాడు డిజిటల్‌, కడప: తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో మెరుపు సమ్మె చేయడానికి వెనకాడబోమని విద్యుత్తు ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు. శనివారం కడపలో రాష్ట్ర స్థాయి విద్యుత్తు ఉద్యోగుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సోమవారం ఎన్జీవోల ఆందోళనకు విద్యుత్తు ఉద్యోగులు సంఘీభావం తెలియజేస్తారు. విద్యుత్తు ఉద్యోగుల డిమాండ్లపై సోమవారమే యాజమాన్యానికి వినతిపత్రం అందచేస్తాం. ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఆందోళనకు దిగుతాం. నెల కిందటే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తమ డిమాండ్ల గురించి వివరించగా... ఎలాంటి స్పందన రాలేదు’ అని మండిపడ్డారు. సదస్సులో నాయకులు ప్రతాప్‌రెడ్డి, సాయికుమార్‌, శివయ్య, రమేష్‌బాబు, వెంకటచలపతి, శివశంకర్‌, సుదర్శన్‌రెడ్డి, వీరభద్రయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని