అవకాశం ఉంటేనే ఓటీఎస్‌ కట్టండి

‘ఓటీఎస్‌పై ఎటువంటి ఒత్తిడి లేదు. చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు ఉంటాయి. అని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గృహనిర్మాణ శాఖ ఏఈ నాగేంద్రవరప్రసాద్‌

Published : 23 Jan 2022 04:57 IST

సీతానగరం, కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘ఓటీఎస్‌పై ఎటువంటి ఒత్తిడి లేదు. చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు ఉంటాయి. అని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గృహనిర్మాణ శాఖ ఏఈ నాగేంద్రవరప్రసాద్‌ స్పష్టంచేశారు. 30 ఏళ్ల నాటి ఇంటిపై అప్పును తీర్చేసినా మళ్లీ ఇప్పుడు ఓటీఎస్‌ కట్టాలని అడిగిన సిబ్బంది వద్ద స్థానికుడైన వీరభద్రరావు శుక్రవారం ఆవేదన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై ‘ఇలాంటి ప్రభుత్వం వస్తుందనుకుంటే పాత రసీదులు దాచేవాళ్లం’ శీర్షికన ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. గృహనిర్మాణశాఖ ఏఈ... సిబ్బందితో లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు.  తూర్పుగోదావరి జిల్లాలో 2000-2019 మధ్య గృహ నిర్మాణాలకు 18,048 మంది రుణం తీసుకుని, పూర్తిగా చెల్లించారని జిల్లా సంయుక్త కలెక్టర్‌(హౌసింగ్‌) ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. వారి వివరాలు గృహనిర్మాణ సంస్థ వద్ద ఉన్నాయని, వాటిని పరిశీలించి, లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని