ఉమ్మడిగా ఉద్యమిస్తేనే ఫలితం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతిలో మోసపోయిన వర్గాలు ఏకతాటిపైకి రావాలని, అప్పుడే డిమాండ్లు సాధించేందుకు అవకాశం ఉంటుందని రాజధాని

Published : 23 Jan 2022 04:57 IST

767వ రోజుకు చేరిన అమరావతి నిరసనలు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తుళ్లూరు గ్రామీణం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతిలో మోసపోయిన వర్గాలు ఏకతాటిపైకి రావాలని, అప్పుడే డిమాండ్లు సాధించేందుకు అవకాశం ఉంటుందని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. అమరావతి కోసం గత రెండేళ్లుగా ఉద్యమిస్తున్నామని గుర్తుచేశారు. ఎవరికి వారు విడివిడిగా ఉద్యమిస్తే ఫలితం ఉండదన్నారు. తాజాగా.. మోసపోయిన వారి జాబితాలో ఉద్యోగులు చేరారని అన్నారు. ముఖ్యమంత్రి మొండి వైఖరి కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనా వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డంపెట్టుకొని ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని నిలిపి వేసిందని రాజధాని రైతులు ఆరోపించారు. సీఎం జగన్‌ ఆశించినట్లు కేవలం పథకాలకు ఓట్లు రాలవని, అంతిమంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడిన వారికే ప్రజలు పట్టం కడతారన్నారు. రాజధాని అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు ఆదివారం 767వ రోజుకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని