
విద్యుత్ టారిఫ్‌పై నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ
ఈనాడు, అమరావతి: విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారం వేయాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణకు బహిరంగ విచారణను రాష్ట్ర విద్యుత్ ,నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సోమవారం చేపట్టనుంది. కరోనా నేపథ్యంలో విశాఖపట్నంనుంచి సోమ, మంగళ, గురువారాల్లో వర్చువల్ విధానంలో బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలు.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపు ఆమోదించాలా లేదా? అని ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. బహిరంగ విచారణలో పాల్గొనేవారు పేర్లను వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. మొత్తం 65 మంది బహిరంగ విచారణలో పాల్గొనటానికి దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఏపీఈఆర్‌సీ వెబ్‌లింక్‌ను పంపింది. పేర్లు నమోదు చేసుకోకున్నా బహిరంగ విచారణలో పాల్గొనాలని భావిస్తే విద్యుత్ పర్యవేక్షణ ఇంజినీరు (ఎస్‌ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఈఈ) కార్యాలయాల్లో సంప్రదిస్తే అవకాశం కల్పిస్తారని ఏపీఈఆర్‌సీ పేర్కొంది. సమావేశాలను https://www.elivetelecast.com/apercpublichearing వెబ్‌లింకు ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి వీక్షించే అవకాశం కల్పించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.