
అరుదైన ‘పులి టేకు’
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆదివారం 35 కిలోల బరువున్న అరుదైన హిమంతుర ఉర్నాక్ జాతికి చెందిన రెటిక్యులేట్ విప్రే చేప (పులి టేకు) చిక్కింది. దీన్ని కుంభాభిషేకం రేవులో వేలం నిర్వహించగా స్థానిక చేపల వ్యాపారి వెంకటేశ్వరరావు రూ.9 వేలకు కొనుగోలు చేశారు. దీని గురించి మత్స్యశాఖ జేడీ శ్రీనివాస్‌రావు వద్ద ప్రస్తావించగా..ఇది ఏడాదికోసారి గుడ్లు పెడుతుందని తెలిపారు. ఈ జాతి అంతరించి పోతున్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గుర్తించిందని చెప్పారు.
-ఈనాడు, కాకినాడ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.